English | Telugu
66 మంది విద్యార్థులకు కరోనా! మద్రాస్ ఐఐటీ క్లోజ్
Updated : Dec 14, 2020
ఐఐటీలోని అన్ని విభాగాలు, లైబ్రరిని వెంటనే మూసివేశారు. అధ్యాపకులు, ఇతర సిబ్బంది, పరిశోధకులు, ప్రాజెక్టుల సిబ్బంది ఇంటి నుంచి పని చేయాలని యాజమాన్యం సూచించింది. క్యాంపస్ లో ఉన్న విద్యార్థులు, హాస్టల్ గదుల్లో మాత్రమే ఉండాలని, బయటకు రావద్దని, కరోనా నిబంధనలన్నీ పాటించాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని, భౌతిదూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సర్క్యులర్ ను విడుదల చేసింది. విద్యార్థులు, సిబ్బందిలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారు అధికారులకు సమాచారం ఇవ్వాలని మద్రాస్ ఐఐటీ యాజమాన్యం సూచించింది.