English | Telugu

మహిళా కానిస్టేబుల్ అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న భర్త!

ప్రకాశం జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ నిర్వాకాన్ని ఆర్మీలో పనిచేస్తోన్న ఆమె భర్త బయటపెట్టాడు. వేటపాలెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్.. మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త సునిల్ రాజ్.. ప్రియుడు అబిషేక్ తో కలసి ఉండగా ఆమెను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు. భార్యపై వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, సునిల్ రాజ్.. ఆర్మీలో పనిచేస్తున్నాడని, కాశ్మీర్ లో ఉంటున్నాడని సమాచారం. కానిస్టేబుల్, అందులోనూ ఆర్మీ ఉద్యోగి భార్య అయ్యుండి ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడం ఏంటనిఆమెపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.