English | Telugu

మరో దిశా కేసు నమోదు... కాలేజ్ వద్ద యువతితో అసభ్య ప్రవర్తన!!

విశాఖపట్నం మాడుగుల పోలీస్ స్టేషన్ లో దిశ కేసు నమోదైంది. గోపాలపట్నంలోని కెజె పురం కు చెందిన ఓ యువతి ని అదే గ్రామానికి చెందిన ఎల్లపు గణేష్, బోడ్డెటి అశోక్ పై ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం చైతన్య కళాశాల వద్ద తనపై వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది. దిశ యాప్ ద్వారా యువతి పోలీసులు కు పిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మహిళలు దిశ యాప్ ని బాగానే ఉపయోగిస్తున్నారు. దిశా యాప్ వచ్చిన తరువాత.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తొలి కేసు నమోదైంది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్‌ బస్సులో ప్రయాణిస్తున్న మహిళను ఓ వ్యక్తి వేధించాడు. వెనుక సీట్లో ఉన్న వ్యక్తి.. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో, వెంటనే ఆమె దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు 7 నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి దగ్గరికి చేరుకొని.. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు చర్యలు తీసుకోవడంతో.. మహిళలకు దిశా యాప్ పై నమ్మకం పెరిగింది. దీంతో ఆపదలో ఉన్నప్పుడు దిశా యాప్ ని ఉపయోగిస్తున్నారు. మొత్తానికి దిశా యాప్ పుణ్యమా అని ఆకతాయిలు గుండెల్లో భయం మొదలైంది.