కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి తో సహా మా ఇంట్లో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అందులో నలుగురు డాక్టర్లేనని, కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ప్రస్తుతం నాలుగో దశలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ తో కూడా ఎలాంటి ఉపయోగం లేదని,వైరస్ వ్యాప్తిని ఆపడం ఎవరి తరం కాదని ఆయన పేర్కొన్నారు. కేవలం మరణాల రేటు తగ్గించడం పైనే దృష్టి పెట్టాలని, ప్లాస్మా తెరపి తోనే మరణాల రేటును తగ్గించగలమని డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు.