English | Telugu
కొండపోచమ్మ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ఇళ్ళు నేల మట్టం!
Updated : Apr 5, 2020
బహిలింపూర్, మామూదాల గ్రామాల్లో కి ప్రజలు వెళ్లకుండా అడ్డంగా కాల్వను తొవ్వుతూ అడ్డుకున్న రైతులను పోలీసులు కెమెరాలతో వీడియో తీస్తూ బెదిరించే ప్రయత్నం చేశారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.
రెండు గ్రామాల పరిధిలోని రైతులకు సంబంధించి న పరిహారం చెల్లించకుండా రైతుల పైనే కేసులు పెడతామని బెదిరింపులు చేస్తున్నారు. ఒకవైపు కారోనాతో రైతులు బెంబేలెత్తిపోతుంటే ఇదే సమయంలో బలవంతంగా పనులు చేస్తే ప్రతిపక్షాలు గానీ ప్రజాసంఘాలు గానీ, రైతులుగానీ అడ్డుకోరని పనులను వేగవంతం చేశారు.
గత వారం రోజులుగా ఈ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోని ఇళ్ళని నేల మట్టం చేశారు. అడ్డుకున్న గ్రామస్థులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.