English | Telugu
వైఎస్ఆర్సీపీ పై గవర్నర్ కు టీ డీ పీ ఫిర్యాదు
Updated : Apr 5, 2020
వైకాపా నాయకులు కరోనా వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని తెదేపా నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం అన్నట్లుగా నగదు పంపిణీ చేస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్‌లో అందించే ఆర్థికసాయాన్ని వైకాపా దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్‌లో ఇస్తున్న రూ.1000 నగదు, నిత్యావసరాలను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం అన్నట్లు వైకాపా నేతలు నగదు పంపిణీ చేస్తున్నారని తెదేపా నేతలు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం అన్నట్లుగా నగదు పంపిణీ చేస్తున్నారని గవర్నర్‌కు వివరించారు.సామాజిక దూరం పాటించకుండా సమూహంగా వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.