English | Telugu
కొడాలి నాని కొత్త లుక్.. ఇలా అయిపోయారేంటి?
Updated : Oct 27, 2025
మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సోమవారం (అక్టోబర్ 27) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు మాజీలూ తిరుమలలో కలిసి తిరగడం కనిపించింది. అయితే ఈ ఇద్దరిలో కొడాలి నాని మాత్రం పూర్తి కొత్త లుక్ లో కనిపించారు. సన్నగా, పీలగా పూర్తిగా గుండుతో ఆయన గుర్తుప ట్టలేనంతగా మారిపోయారు.
కొడాలి నాని ఇటీవలే అనారోగ్యం నుంచి కోలకుున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన బయట కనిపించడం అన్నది చాలా చాలా అరుదుగా జరుగుతోంది. ఇటీవలే జగన్ తన లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా ఒక సారి కనిపించారు. వైసీపీ నాయకులతో కలిసి విమానాశ్రయంలో జగన్ కు స్వాగతం పలికారు. ఆ తరువాత కొడాలి నాని బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి.