English | Telugu

పారిశుద్ధ్య కార్మికులకు ఫ్రూట్ జ్యూస్!

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, నగర రోడ్లపై కష్టపడి పనిచేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికుల కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆరు వేల యూనిట్ల రియల్ ఫ్రూట్ జ్యుస్ ప్యాకెట్లను, కేంద్రమంత్రి సూచన మేరకు బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శి శశికిరణచారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కరోన వైరస్ అందరికి కష్టాలు తెచ్చిందని, మహమ్మరిని తరిమి కొట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రజలు కూడా ప్రభుత్వం కరోన కట్టడి కోసం చేసిన నిబంధనలు పాటించాలని కోరారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని అలానే ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలే కాకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ కష్టకాలంలో తమ తోటివారిని, పెదవాళ్ళను ఆదుకోవాలని లక్ష్మణ్ పిలుపిచ్చారు. రోడ్లపై పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం కిషన్ రెడ్డిగారు 6000 ల లీటర్ల ఫ్రూట్ జ్యుస్ ఇవ్వడం అభినందనీయమని ,ఇంకా ఎందరో స్పందించాలని లక్ష్మణ్ కోరారు.