English | Telugu

రాజ్యసభకు కేసీఆర్..? టీఆర్ఎస్ లో ఆసక్తికరమైన చర్చ..!

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారంటూ ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతుండగా.... రీసెంట్ గా ఉపముఖ్యమంత్రి పదవి చేపడతారంటూ వార్తలొచ్చాయి. ఇక, కేటీఆర్ సోదరి కవిత... అతిత్వరలోనే రాష్ట్ర కేబినెట్లోకి రానుందంటూ మరో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ రెండింటినీ మించిన మరో చర్చ గులాబీ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ ... ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ కు అప్పగించి.... ఆయన రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం నడుస్తోంది. మరి, ఇందులో ఎంత నిజముందో తెలియదు గానీ... కేసీఆర్ రాజ్యసభకు వెళ్తే కనుక... గజ్వేల్ ఉపఎన్నిక బరిలోకి కవిత దిగుతారని అంటున్నారు. ఎప్పట్నుంచో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్... రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారని చెబుతున్నారు.

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటున్న గులాబీ శ్రేణులు.... ఇలాంటి అనూహ్య పరిణామాలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఎందుకంటే, కవితకు మంచి రాజకీయ భవిష్యత్ కల్పించడం కేసీఆర్ ఏమైనా చేస్తారని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ లో కేసీఆర్ అండ్ కవిత పొలిటికల్ స్టెప్స్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేసీఆర్ నిజంగానే రాజ్యసభకు వెళ్తారా? అలాగే, కవిత రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తారా? లేదా? అన్నది తేలాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.