English | Telugu
బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్
Updated : Jul 23, 2020
ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బాలయ్యకు ఫోన్ చేసి విగ్రహం వివాదంపై నిశితంగా చర్చించారు. అసలు ఆ విగ్రహాన్ని స్థానికులు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో బాలయ్యకు వివరించారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం ఆలయం ఎదురుగా ఉన్నందునే స్థానికులు తొలగించారని ఎమ్మెల్యే చెప్పారు. అంతేకాదు, తాను కూడా ఎన్టీఆర్ వీరాభిమానినని చెప్పిన రామిరెడ్డి.. వివాదాస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు బాలయ్య కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. మొత్తానికి విగ్రహం తొలగింపుపై గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు.