English | Telugu
నిమ్మగడ్డను కలిస్తే తప్పేంటి.. కామినేని సూటి ప్రశ్న
Updated : Jun 23, 2020
అదే సమయంలో తమ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా వచ్చారని దీంట్లో తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటని కామినేని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని కుట్రపూరితంగా పదవి నుండి తప్పించి, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా లెక్క చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న వాళ్ళు సిగ్గుపడాలని ఆయన అన్నారు.
ఈ నెల 11న సుప్రీంకోర్టు లో జరిగిన వాదనల లో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగా డాక్టర్ రమేష్ కుమార్ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఆయన విధుల్లో చేరకుండా అడ్డుకుంటోందని శ్రీనివాస్ అన్నారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని డాక్టర్ రమేష్ కుమార్ కోర్టులోనే ప్రస్తావించారని అందువల్ల తాము రహస్యంగా కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంటుందని ఈ సందర్బంగా శ్రీనివాస్ ప్రశ్నించారు. డాక్టర్ రమేష్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా లేరని అందువల్ల ఆయన స్వయంగా వచ్చి కలవడంలో ఎలాంటి తప్పు లేదని కామినేని తెలిపారు.