English | Telugu
కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్
Updated : Jul 22, 2020
సామాన్యలనే కాదు సెలబ్రేటీలను, వ్యాపారవేత్తలను, అధికారులను, పొలిటీషీయన్ల ను తాకుతుంది కరోనా వైరస్. ఆంధ్రలో అనేక మంది రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిలో గన్ మెన్ కు, డ్రైవర్, పిఏకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో కడియం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో నిమ్స్ లో చేరుతారని సమాచారం.