English | Telugu

పక్కాగా జనగణన! దేశ‌వ్యాప్తంగా శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు

భారతదేశ జనగణన 2021కు సంబంధించి జనగణన అధికారులకు ఇళ్ల జాబితా, ఇళ్ల గణన జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌) నవీకరణపై శిక్షణ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి.

దేశ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించటానికి జనాభా లెక్కలే కీలకమని, జనగణన 2021ని సమర్థంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు.

జనాభా లెక్కల ఆధారంగానే స్టాట్యుటరీ, నాన్‌ స్టాట్యుటరీ పనుల ప్రణాళికలు రూపొందిస్తారు. జనాభా వృద్ధి జనాభా లెక్కల ద్వారా తెలుస్తుందని, పట్టణం, గ్రామం, వార్డు స్థాయి వరకు సమాచారం సేకరించే అతిపెద్ద కార్యక్రమం.

జనాభా గణన 2021 మొదటి దశ ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరుగుతుంది. ఇళ్ల జాబితా సేకరణ సమయంలో ఎన్‌పీఆర్‌ డేటా బేస్‌ నవీకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రశ్నలను స్నేహపూర్వకంగా అడుగుతారు.

ప్రజలు అందించిన వివరాలను నిర్ధరించడానికి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలను అడ‌గ‌రు. ఈ మేరకు భారత ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయాయి.