English | Telugu
కరెంట్ బిల్ దోపిడీ! చేతివాటం ప్రదర్శిస్తున్న విద్యుత్ శాఖ
Updated : Mar 13, 2020
విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజులవరకు బిల్లులు కొట్టి ఇస్తున్నారు.100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. ఇక్కడే వుంది టెక్నిక్.
ప్రజలు అనవసరంగా అంటే మూడు రూపాయల 60 పైసల స్లాబ్ నుంచి ఆరు రూపాయల తొంభై పైసల స్లాబ్‌లో బలవంతంగా చేరాల్సి వస్తోంది.
లెక్క ఇలా వుంటోంది. కేవలం రెండు రోజులు ఆలస్యంగా బిల్ రీడింగ్ చేయడం వల్ల 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం. ఇదే ప్రస్తుతం జరుగుతోంది.
AE, DE & SE levelలో వొస్తున్న అదేశాలనుసరంగా బిల్లింగ్ ఇలా లేట్ గా తీసి అదనంగా డబ్బులు కట్టేలా చేస్తున్నారు. ఈ మోసం ప్రతి నెల జరుగుతుంది. జనం నోరు మూసుకొని బిల్లులు కడుతున్నారు. ప్రజా సంఘాల నాయకులు దీనిపై ఆలోచించడం లేదు.