English | Telugu
ఇస్రో మరో విజయం సాధించింది
Updated : Nov 27, 2019
భారత అంతరిక్ష ప్రయోగ క్షేత్రం ఇస్రో మరో విజయం సాధించింది. నింగిలో మరో విజయ పతాకాన్ని ఎగురవేసింది. రాకెట్ ప్రయోగాలలో భారతకు ఎవరూ సాటి లేరని నిరూపించుకుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ-47 వాహన నౌక ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ-47 వాహన నౌక కార్టోశాట్ ౩ తో పాటు యూఎస్ కు చెందిన 13 ఉపగ్రహాల్ని నింగి లోకి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. నింగి లోకి వెళుతున్న కార్టోశాట్ 3 లో 0.25 మీటర్ల కంటే మెరుగైన రిసల్యూషన్ తో కూడిన చిత్రాలని తీసే సామర్థ్యం ఉంది. ఇస్రో విజయవంతంగా రాకెట్ ను ప్రయోగించిందన్నారు ఇస్రో చైర్మన్ శివన్. ఈ అద్భుతమైన రాకెట్ ప్రయోగంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మార్చి వరకూ తమకు 13 మిషన్ లు ఉన్నాయి. ఇస్రోకి తగినంత పని వుందని చెప్పుకొచ్చారు.
ఈ రాకెట్ ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్ 3 ఉపగ్రహాన్ని కక్ష్య లోకి ప్రవేశ పెడుతోంది. అలాగే అమెరికాకు చెందిన 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలు రోదసి లోకి పంపించారు. ఇందులో 12 ఫ్లో పోపి అనే బుల్లి ఉపగ్రహాలు, మేష్ బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహాం ఉంది. ఇది షార్ ఆధ్వర్యంలో నిర్వహించిన 74 వ ప్రయోగం. షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగాలు 48 జరిగాయి. ఇందులో 2 మినహా మిగిలినవన్నీ విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకూ 20 వరకు ఎక్సెల్ వాహక నౌకల్లో పంపారు. ఈ ఏడాదిలో ఇది 5 వ రాకెట్ ప్రయోగం. చంద్రయాన్ 2 తరువాత మొదటి ప్రయోగం. కార్టోశాట్ సిరీస్ లో 9 వ ఉపగ్రహం. ఇప్పటి వరకు ఇస్రో కార్టోశాట్ కు చెందిన 8 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. గతంలో పంపిన కార్టోశాట్ 2,2A,2B ఉపగ్రహాల్లోని కేమరాలకు 0.8 మీటర్స్ కచ్చితత్వం ఉంది. కార్టోశాట్ 3 లో 0.25 మీటర్ల కంటే మెరుగైన రిజల్యూషన్ తో చిత్రాలను తీసే సామర్థ్యం ఉంది.