English | Telugu
జగన్ వద్దన్న జాస్తి కృష్ణకిషోర్ కు కేంద్రం బంపరాఫర్...
Updated : Apr 22, 2020
జాస్తి కృష్ణ కిషోర్‌కు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి(ఈడీబీ) సీఈవోగా పనిచేసిన కృష్ణకిషోర్. ఈడీబీ సీఈవోగా కృష్ణకిషోర్ వ్యవహరించిన సమయంలో అవకతవకలు జరిగాయని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ తర్వాత కేంద్ర సర్వీసుల్లో తన సొంత శాఖ ఆదాయపు పన్ను విభాగానికి వెళ్లిపోయిన కృష్ణ కిషోర్ కు ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను శాఖ ఛీఫ్ కమిషనర్ పదవి నుంచి ప్రిన్సిపల్ ఛీఫ్ కమిషనర్ గా నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన్ను ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. రేపు ఆయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.
ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ ఎకనామిక్ డెపలప్ మెంట్ బోర్డు సీఈవోగా వ్యవహరించిన జాస్తి కృష్ణ కిషోర్ అప్పట్లో పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో కృష్ణ కిషోర్ కృషి కారణంగా ఏపీ సర్కారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా మొదటి స్ధానంలో నిలిచింది. కానీ ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన్ను టార్గెట్ చేసింది. వ్యక్తిగత కక్షతో ఈడీబీలో స్టేషనరీ నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ సస్పెన్షన్ విధించింది. దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించగా.. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కేంద్రంలోని తన సొంత శాఖకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా కేంద్రం ఆయన్ను ఐటీ ప్రిన్సిపల్ ఛీఫ్ కమిషనర్ గా నియమించడం విశేషం.