English | Telugu

స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో భారీగా ఐపిఎస్ బదిలీలు పదోన్నతులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి.

పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా హరీశ్‌ కుమార్‌ గుప్తా,
విశాఖపట్నం అదనపు డీజీగా ఆర్‌కే మీనాకు పదోన్నతి లభించింది.
ఎస్‌ఐబీ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌,
మైరెన్‌ విభాగం ఐజీగా ఏఎస్‌ఖాన్‌ నియమితులయ్యారు.
గుంటూరు రేంజ్‌ ఐజీగా జె.ప్రభాకర్‌రావు బదిలీ అయ్యారు.
డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌ ఐజీతో పాటు ఎక్సైజ్‌. ప్రొహెబిషన్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు అదనపు బాధ్యతలు దక్కాయి.
డిజీపీ కార్యాలయంలో లీగల్ ఐజీగా నాగేంద్ర కుమార్ నియ‌మితుల‌య్యారు.

వీరే కాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి,
ఇంటెలిజెన్స్ డీఐజీగా విజయ్ కుమార్,
ఏసీబీ ఐజీగా అశోక్ కుమార్,
ఏలూరు రేంజ్ డీఐజీగా కేవి మోహన్ రావు,
నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్ సునీల్ ,
ఏపీఎస్సీ కాకినాడ కమాండెంట్ గా అమిత్ బర్దార్,
కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి,
ఎస్ఐబీ చీఫ్ గా శ్రీకాంత్,
ఐజీ లీగల్ గా పి.హరికుమార్,
సీఐడీ డీఐజీగా హరికృష్ణ,
ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా ఎస్వీ రాజశేఖర్ బాబులను ప్రభుత్వం నియమించింది.