English | Telugu
ఏపీలో శానిటైజర్ మరణాల తీగ లాగితే తెలంగాణలో తేలింది..
Updated : Aug 8, 2020
అంతే కాకుండా అసలు శానిటైజర్ తయారీలో కూడా గోల్ మాల్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇథనాల్ కానీ లేదా ఇథైల్ ఆల్కహాల్ కానీ కలిపి తయారు చేయాల్సిన శానిటైజర్ లో మిథైల్ ఆల్కహాల్ కలిపి చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ తయారైన శానిటైజర్లను ఏపీలోని ఒక డిస్ట్రిబ్యూటర్‌కు పంపగా అవి కురిచేడుకు చేరి 16 మంది ప్రాణాలు హరించాయి. ప్రస్తుతం ఈ కేసు ను ఐదు బృందాలు విచారణ జరుపుతున్నాయి. కురిచేడులో శానిటైజర్ తాగిన వారిలో 46 మంది ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.