English | Telugu
విమాన ప్రమాదంలో మరో విషాదం.. మృతులలో ఒకరి కరోనా
Updated : Aug 8, 2020
నిన్న రాత్రి కొజికోడ్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఇప్పటికే 20 మంది మృతి చెందిన విషాదం నుండి ఇంకా తేరుకోక ముందే తాజాగా మరో ఆందోళనకరమైన సంగతి తెలిసింది. అదేంటంటే ప్రమాద మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తాజాగా జరిపిన పరీక్షల్లో తేలింది. దీంతో నిన్న రాత్రి నుండి విమాన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్నవారిలో తాజాగా ఆందోళన మొదలైంది. అంతే కాకుండా విమానంలో వచ్చిన ప్రయాణికులు కూడా టెన్షన్ పడుతున్నారు.
దీంతో నిన్నటి నుండి విమాన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా టెస్టులు చేయించుకోవాలని అంతే కాకుండా ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లోకి వెళ్లాలని వారికి కేరళ ప్రభుత్వం సూచించింది. ఇదే సమయంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విమాన ప్రయాణికులకి కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నామని కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
విమాన ప్రమాదం సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. దీంతో అందరిలో టెన్షన్ నెలకొంది.