English | Telugu
మోత మోగిపోతున్న కూరగాయల ధరలు... కిలో బెండ కాయలు 120 రూపాయలు..
Updated : Mar 23, 2020
* అధిక ధరలపై సి.ఎం. కె సి ఆర్ హెచ్చరికలు బేఖాతర్
* పత్తా లేని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు
ఇదెక్కడో సూపర్ మార్కెట్లలో అనుకుంటే పొరపాటే. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో ధరలు చుక్కలని తాకాయి... నిత్యావసరాలు, పాలు, కూరగాయల ను జనతా కర్ఫ్యూ నుంచి మినహాయించినప్పటికీ, ఆ విషయం మీద నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ మాట్లాడుతూ-నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ -గుడిమల్కాపూర్ మార్కెట్ లో వినియోగదారులను వ్యాపారులు దాదాపుగా దోచేశారు. మొన్నటి వరకు కిలో 30 రూపాయలు పలికిన బెండకాయల ధర ఈ రోజు కిలో 120 రూపాయలు, దొండకాయలు కిలో 90 రూపాయలు, బీర కాయలు కిలో 100 రూపాయలు, చిన్న కొత్తిమీర కట్ట 10 రూపాయలు, చిన్న పుదీనా కట్ట 40 రూపాయలు.... వంకాయలైతే ఏకంగా 110 రూపాయలు... నిజానికి, అక్కడి వ్యాపారులకు లేదా రైతులకు, ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది... కానీ, వారిని నియంత్రించటానికి , వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవటం తో అడ్డగోలుగా కూరగాయల ధరలు పెంచేశారు. కె సి ఆర్ సార్.. మీరు కొరడా ఝుళిపించారు సరే.. ఇక్కడి వ్యాపారాలు మాత్రం మీ మాట ఖాతరు చేయటం లేదు... ప్రజల జేబులను దోచేస్తున్నారు.. ఒక్కసారి మీరు నజర్ పెట్టండి.. వీళ్ళు లైన్ లోకి వస్తారంటున్నారు వినియోగదారులు..