English | Telugu

స్థానిక సమరం.. ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

ఏపీలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల ( ఫిబ్రవరి ) 17వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే నెల ( మార్చి ) 15వ తేదీలోగా ఎన్నికలను పూర్తి చేయాలి. ఈ ఎన్నికలకు ప్రభుత్వం రంగం చేస్తుంది. ముందుగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అవ్వగానే.. నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. రిజర్వేషన్ల విషయాలో హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.

ఇక జగన్ సర్కార్ వేసిన మూడు రంగులు కూడా తొలగించాలని తీర్పును ఇచ్చింది హై కోర్టు. పార్టీ రంగులను గ్రామ పంచాయతీలకు వేయడాన్ని తప్పు పడుతూ.. అలా చేయడం మంచి పద్ధతి కాదని మందలించింది. మూడు రాజధానుల రభస.. రైతుల తిరుగుబాటు.. అన్ని అంశాలు ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.