English | Telugu
హైటెన్షన్... నల్లమల అడవిలో కార్చిచ్చు
Updated : Feb 4, 2020
నల్లమల అడవిలో కార్చిచ్చు చెలరేగింది. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. దోమలపెంట-వటవర్లపల్లి మార్గంలో శ్రీశైలం వెళ్లే మార్గంలో మంటలు చెలరేగాయి. దీంతో అడవి తగలబడుతోంది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మరోవైపు, నల్లమల అడవిలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరన్నా కావాలని అంటించారా? లేక ఎండలకు ఇలా జరిగిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.