తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు చలివేంద్ర సురేష్ యథేచ్ఛగా పేకాట క్లబ్ ను నిర్వహించిన వైనం వెలుగులోకి వచ్చింది. ఓ అపార్ట్మెంట్ లో నివాసం కోసం అద్దెకు తీసుకున్న ఆయన పేకాట క్లబ్ ను నిర్వహిస్తున్నాడని తెలిసింది. పోలీసులు ఆ పేకాట క్లబ్‌పై దాడి చేసి 29 మందిని అరెస్టు చేశారు. అయితే క్లబ్ నిర్వాహకుడు సురేష్ ని మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదు. అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, ఎమ్మెల్యే అనుచరుడు కావడంతోనే అరెస్ట్ చేయాలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒక వీడియో షేర్ చేసింది. "తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు సురేష్ యథేచ్ఛగా అపార్ట్మెంట్ లో పేకాట క్లబ్ నిర్వహణ.. ఇలాంటివి బయటపడనవి ఇంకెన్నో!!" అంటూ పేర్కొంది.