English | Telugu
పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 ఎక్సైజ్ సుంకం పెంపు!
Updated : Mar 14, 2020
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిపెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 మేరకు తగ్గించిన కొద్దిరోజులకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ .2 నుండి రూ .8, డీజిల్‌కు రూ .4 మేరకు పెంచారు. అటు పెట్రోల్‌పై రోడ్‌సెస్‌ను లీటరుకు రూ .1, డీజిల్‌కు రూ .10గా నిర్ణయించారు.
మార్చి 11 న పెట్రోల్ ధరను రూ. 2.69 మేరకు తగ్గించగా.. డీజిల్ ధరలను రూ .2.33కు తగ్గించారు. మరోవైపు అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. ప్రపంచదేశాలన్ని కరోనా వైరస్ వణికిపోతున్న నేపథ్యంలో మార్కెట్ అంతటా పతనం అవుతోంది. అంతర్జాతీయ చమురు ధరలు కూడా 31 శాతానికి పడిపోయాయి. అయినా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దేశ ప్రజలకు మింగుడుపడడం లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వచ్చినా నరేంద్ర మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తాజా నిర్ణయంతో రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందట.