English | Telugu
భజన కు పడిపోతే, నిమజ్జనమే నంటూ నాయుడుకి చురకలు!!
Updated : Mar 14, 2020
తెలుగుదేశం లో అసమ్మతి స్వరం తీవ్రత పెరిగింది. సోషల్ మీడియా లో సొంత పార్టీ వారే, నాయకత్వపు లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఒక వైపు నాయుడు వైఫల్యాలను ఎండా గడుతూనే, మరోవైపు వై.ఎస్.ఆర్.సి.పి దుర్మార్గ పాలన చేస్తోందంటూ నిప్పులు చెరుగుతున్నారు.
" ఇవ్వాళ తెలుగుదేశం పార్టీ దుస్థితికి వినాయక చవితి పండగకి అవినాభావ సంబంధం ఉంది...భజన భజన భజనలో మునిగి ఎలాగైతే నిమజ్జనం జేస్తారో ఈరోజు అదే జరుగుతోంది...కనీసం ఇప్పుడు అయినా ధైర్యంగా ముందడుగు వేసే కార్యకర్తల పేర్లు పార్టీ ఆఫీసులో రాసి పెట్టుకుంటున్నారా ?? బరి తెగించే నాయకుల పేర్లు రాసి పెట్టుకుంటున్నారా?? పొర్లు దండాలు పెట్టె అధికారుల పేర్లు రాసిపెట్టుకుంటున్నారా?? ఇవేవీ లేకుండా ఆంధ్ర బీహార్ అయిందని మనం ఎంత గింజుకున్నా సోషల్ మీడియాలో ఎంత ఏడ్చినా ఎన్ని ప్రెస్మీట్లు పెట్టినా లాభం ఏంటో మనకె అర్ధమవ్వాలి," అంటూ ఒక తెలుగు దేశం గాఢాభిమాని పోస్ట్ పెట్టాడు...ఇది ఇప్పుడు తెలుగుదేశం హెడ్ క్వార్ట్రర్స్ లో పెద్ద చర్చ కు దారి తీసింది.
నాయకులు అందరూ పోతున్నారని పోయేవాళ్ళ మీద ఏడ్చే మనం లోకేష్ & చంద్రబాబు ఎన్ని నామినేషన్లకి హాజరయ్యారో మనమే ఆలోచించుకోవాలి...ఇవ్వాళ మనం చూసే అరాచకం అంతా కూడా నిజమైన అరాచకం కాదు..అదంతా పెయిడ్ ముఠాల అరాచకం..నాయకుల దృష్టిలో పడేదానికి, నాయకులకి కలెక్షన్ ఎజెంట్లుగా వుండే దానికి వాళ్ళు పడే ఆరాటం..దానికి ఉదాహరణ నిన్న మాచర్ల తురకా కిషోర్ లాంటి వాళ్ళ అతి..ఒకప్పుడు బాంబులు,కత్తులు పట్టుకుని తిరిగినవాళ్ళు కూడా ఇలాంటివి చూసి నవ్వుకుంటున్నారు..ఇప్పుడు నడిచేది అంత "ఆర్ధిక ఫ్యాక్షన్"...అడ్డదిడ్డంగా డబ్బు సంపాదించిన నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పులి పదవి పోగానే పిల్లి, అంటూ వ్యాఖ్యానించిన ఆ నెటిజెనుడు , తెలుగు దేశం పార్టీ నాయకత్వాన్ని కాస్త గట్టిగానే అప్రమత్తం చేశారు.