English | Telugu

ఊహాగానాలు వ‌ద్దు! లాక్ డౌన్ పై నిర్ణ‌యం తీసుకోలేదు!

ఏప్రిల్‌ 14 తరువాత కూడా కొంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించడం పై కేంద్రం కసరత్తు చేస్తోంది. లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, నిపుణుల సూచనలు చేశారు. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఊహాగానాలు వద్దని కేంద్ర ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది.

మత ప్రదేశాల్లో కార్యకలాపాలపై మే 15 వరకు ఆంక్షలతో పాటు, మే15 వరకు విద్యా సంస్థల మూసివేయాల‌ని కరోనా నేప‌థ్యంలో కేంద్ర మంత్రుల బృందం సిఫారసు చేసింది. అయితే విద్యాసంస్థలు, షాపింగ్‌ మాల్స్, మతపరమైన కేంద్రాల్లో ఏప్రిల్‌ 14 తరువాత కనీసం నెల రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగే అవకాశం వుంది. సాధారణ కార్యకలాపాలను ఎట్లిపరిస్థితుల్లో అనుమతించకూడదని జీఓఎం సిఫారసు చేసింది.

మత ప్రాంతాలు, షాపింగ్‌ మాల్స్‌ తదితర బహిరంగ ప్రదేశాలపై డ్రోన్లతో సునిశిత పర్యవేక్షణ పెట్ట‌నున్నారు. ఆల్కహాల్‌ ఉత్పత్తులను అమ్మేందుకు అనుమతించాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, యూపీ సహా 10 రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.