English | Telugu
హిందూ మహిళ పాడే మోసిన ముస్లింలు!
Updated : Apr 8, 2020
దీంతో స్థానికంగా ఉన్న ముస్లింయువకులు అక్కడికి చేరుకుని దహనసంస్కారాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అంతే కాదు దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఏ విధమైన వాహనమూ అందుబాటులో లేకపోవడంతో, మాస్క్ లు ధరించి, తమ భుజాలపై పాడెను మోస్తూ శ్మశానానికి తీసుకెళ్లారు. తమకు ఆ మహిళ చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆమె మరణిస్తే, అంత్యక్రియలకు సహకరించడం తమ విధిగా భావించామని ముస్లిం యువకులు వ్యాఖ్యానించారు.
ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనుషులంతా కులమతాలకు అతీతంగా ఒకరికొకరు సహరించుకుంటున్నారు. హిందూ-ముస్లిం భాయీ భాయీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హిందూ మహిళ పాడే మోసిన ముస్లిం యువకులపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రశంసలు కురిపించారు.