English | Telugu

ఇప్పుడే కొనుక్కోండి.. భారీగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర..

ఇటీవల కాలంలో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్లిన బంగారం ధర ఇప్పుడు తగ్గు ముఖం పడుతోంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుతోంది. గత సెప్టెంబర్ లో 40,000 ల రూపాయల మార్కును దాటిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు 38,000 ల రూపాయల స్థాయికి దిగి వచ్చింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి 34,900 ల రూపాయలుగా ఉంది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తుండటంతో మళ్లీ పెట్టుబడులు బంగారం నుంచి ఈక్విటీ మార్కెట్ ల వైపు మళ్లుతున్నాయి. ఇది బంగారం ధర పతనానికి దారి తీస్తుంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర రూ.1,467 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ కు తోడు దేశీయంగా నగల వ్యాపారులు వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర పతనమవుతుంది. వెండి ధర కూడా భారీగానే తగ్గుతుంది. ప్రస్తుతం కేజీ వెండి రూ.44 వేల రూపాయలుగా ఉంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు వెండి 17 డాలర్ లకు లోపే ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్ లో కూడా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. ఈ పతనం మరికొంత కాలం సాగే సూచనలు కనిపిస్తున్నాయి