English | Telugu

నగరంలో నయా రోడ్లు.. గుంత పడిన గంటకే పూడ్చేస్తారు

చిన్న వర్షం పడితే చాలు రోడ్డు మీద నిలిచిపోయే నీళ్లు, చెత్తా చెదారాన్ని ఎవరు చూడరు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాధుడు లేడు. ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు ఉండవు. భాగ్యనగరం రోడ్ల గురుంచి ప్రస్తావిస్తే ఇవే గుర్తొస్తాయి. ఈ కష్టాలు త్వరలోనే తీరిపోనున్నాయి. ప్రధాన రహదారుల మార్గాల్లో 709 కిలోమీటర్ల మేర రోడ్ల పనుల నిర్వహణను ఐదేళ్ల పాటు ప్రైవేటు ఏజెన్సీల చూసుకుంటున్నాయి. దీనికోసం 1800 కోట్లను కేటాయించనుంది ప్రభుత్వం. ఈ మేరకు జోన్ల వారీగా ఏడు ప్యాకేజీలగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. దీనిలో నాలుగు ప్యాకేజీలకు అనుమతులిస్తూ ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. మిగతా మూడు ప్యాకేజీలకు ఆర్థిక శాఖ అనుమతి రాగానే జీవోలు వెలువడనున్నాయి. తరవాత వారం రోజుల్లోగా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అమల్లోకి రానుంది. దీంతో టెండర్ దక్కించుకున్న సంస్థలు నెలరోజుల్లో రోడ్ల పనులు ప్రారంభించనున్నాయి. ఇందులో భాగంగా ఏజెన్సీలకు ఐదేళ్ళల్లో చేయవలసిన పనుల ప్రణాళికను రూపొందించారు.

టెండర్లు దక్కించుకున్న సంస్థలు మొదటి నెలలో గుంతలు పూడుస్తున్నారు. ఇక ఆరు నెలల్లోగా పూర్తిగా దెబ్బ తిన్న రోడ్లను బాగు చేయడం..ఆ తర్వాత తొలి ఏడాది 50% , రెండో ఏడాది 30% , మూడో ఏడాది 20% కొత్తగా రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు వాటి మెయింటెనెన్స్ నిర్వహిస్తారు. వీటితో సహా ఎక్కడ ఏ విధానం అవసరమనుకుంటే దాన్ని కాంట్రాక్టు సంస్థలు చూసుకోవాలి ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించనున్నారు. రోడ్లు తళతళలాడేలా ప్రయాణానికి అనువుగా ఫుట్ పాత్ పచ్చదనం పారిశుధ్యం వంటి బాధ్యత లను కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఖచ్చితంగా పాటించాలి.జాతీయ రహదారులపై చిన్నపాటి గుంత పడిన నిర్మాణ సంస్థలు రోడ్డు నాలుగు మూడేళ్ల వరకూ తొలగించి కొత్త రోడ్లు వేస్తారు. నగరంలోని రహదారులపై ఇలాంటి పరిస్థితి ఉండదు. గుంత పడిన ప్రదేశంలో తాత్కాలిక మరమ్మతులు చేస్తారు. వర్షం పడితే రోడ్ల పై చెత్తా చెదారం.. నీటి నిల్వ.. డ్రైనేజ్ వాటర్ వస్తూ ఉంటుంది. దీనితో పాటు ఫుట్ పాత్, స్పీడ్ బ్రేకర్లు, బార్ మార్కింగ్స్, లేన్ మార్కింగ్, రోడ్ స్టార్స్, సైనేజ్ బోర్డు వంటివి కనిపించవు. ప్రైవేటు ఏజెన్సీలకు రోడ్డు మెయింటెనెన్స్ అప్పగించటం వల్ల ఇవన్నీ ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి భాగ్యనగర ప్రజల సమస్యలు దీనితో పూర్తిగా తీరనున్నాయో లేదో వేచి చూడాలి.