English | Telugu
ఆన్‌లైన్‌లో ఉచితంగా ఇంగ్లీష్ నేర్చుకోండి!
Updated : Apr 4, 2020
ప్రముఖ సంస్థలైన బైజూస్, వేదాంటు, టాపర్, అన్ అకాడమీ, ఎక్స్‌ట్రామార్క్స్, అప్‌గ్రేడ్, విడు, ఇంపార్టస్ వంటి సంస్థలు నెల, రెండు నెలలకు ఉచిత సేవలు అందిస్తున్నాయి.
బైజూస్: ఏప్రిల్ 30 వరకు పూర్తి లైబ్రరీకి ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. ఉచిత లైవ్ తరగతులు అందిస్తోంది.
టాపర్: 5 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులందరికీ లైవ్ తరగతులు.
వేదాంటు: నిపుణులైన ఉపాధ్యాయులతో లైవ్ తరగతులు. స్టడీ మెటీరియల్, పరీక్షలు, ప్రశ్నలు, లైవ్‌లోనే సందేహాల నివృత్తి. వేదాంటు నుంచి కంటెంట్‌ను ఉపయోగించుకొని ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు బోధించవచ్చు.
ఎక్స్‌ట్రామార్క్స్ : ఏప్రిల్ 30 వరకు ఈ యాప్ ఉచిత సేవలు అందిస్తుంది. లైవ్ కోసం నెలకు రూ.2 వేలతో ఛార్జింగ్ చేసుకోవాలి.
అన్ అకాడమీ: యూపీఎస్సీ, రైల్వే, బ్యాకింగ్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత ఉపన్యాసాలు(లెక్చర్స్) అందిస్తోంది. ఈ ప్లాట్‌పామ్ నుంచి 20వేల ఉచిత లైవ్ క్లాసులు అందిస్తుంది. విద్యా సంస్థలు తమ లైవ్ తరగతులను అన్ అకాడమీలో నిర్వహించేందుకు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఆయా విద్యా సంస్థలు తమ ఆన్‌లైన్ తరగతులను ఏర్పాటు చేయడానికి ఇది సహాయం చేస్తుంది.
అప్‌గ్రేడ్: కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు ఉచిత లైవ్ ప్లాట్‌ఫామ్ అందిస్తోంది.
విడు: లైవ్ ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది. పాఠశాలల నుంచి తరగతులను ఇంటికి లైవ్‌లో ఇచ్చేందుకు సహాయం అందిస్తుంది.
ది గేట్ అకాడమీ: ఇంజినీరింగ్ విద్యార్థులు, గేట్‌కు సన్నద్ధమయ్యే వారికి ఏప్రిల్ 30 వరకు ఉచిత వీడియో తరగతుల సదుపాయం కల్పిస్తోంది.
స్కూల్‌గురు ఎడుసర్వ్: ఉన్నత విద్యకు సంబంధించి మొదటి మూడు నెలలు ఉచితంగా అందిస్తుంది.
ప్లే ఆబ్లో: ప్రాథమిక పాఠశాలలకు గణితం, ఆంగ్ల వ్యాకరణంపై ఈ యాప్‌తో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయొచ్చు. ఏప్రిల్ నెల చివరి వరకు ఈ సదుపాయం అందిస్తోంది.
ఇంపార్టస్: లైవ్ ఆన్‌లైన్ అభ్యాసం కోసం రూపొందించిన ‘వినూత్న’ వర్చువల్ తరగతులను అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా అందిస్తోంది. విద్యార్థులు తమ సందేహాలను ఉపాధ్యాయులతో నేరుగా అడిగి తెలుసుకోవచ్చు.
స్టూమాజ్: కళాశాల, విద్యార్థులకు లైవ్ వెబ్‌నార్లను అందిస్తోంది.
క్యాటలిస్ట్ గ్రూప్: వివిధ పోటీ పరీక్షల కోసం ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది.
లెర్న్‌నెక్స్ట్: వీడియో పాఠాలు, ప్రాక్టీస్ పరీక్షలను ఉచితంగా అందిస్తోంది.
సింప్లీలార్న్: కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, బిగ్‌డాట, సైబర్ సెక్యూరిటీలాంటి ఉచిత కోర్సులను అందిస్తోంది.
మైండ్‌స్పార్క్: విద్యార్థులందరికీ 60రోజుల ఉచిత ప్రవేశం.