English | Telugu

ఏపీలో నలుగురు డాక్టర్లకు కరోనా

అనంతపురంలో ఇవాళ ఒక్కరోజే 7 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ గంధం చంద్రుడు అధికారికంగా ప్రకటించారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 13కి చేరుకున్నాయన్నారు. మక్కా నుంచి వచ్చిన ఇద్దరు , కల్యాణ దుర్గం నుంచి ఢిల్లీ వెళ్లిన మరో వ్యక్తి కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా... ఇటీవల కరోన పాజిటివ్ తో మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చిన నలుగురు డాక్టర్ల కు కూడా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు.