బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ ప్లేసులు, సంస్థల్లో పాన్, తంబాకు ఉమ్మి వేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. నిషేధం తక్షణం అమల్లోకి తెస్తూ ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అనారోగ్య అలవాట్లతో కరోనా వంటి వైరస్ సోకుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది.