English | Telugu
మళ్లీ గులాబి గూటికి కోనేరు
Updated : Sep 25, 2025
కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మళ్లీ గులాబీ కండువా కప్పుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన కోనేరు కోనప్ప.. ఆ తరువాత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు సమక్షంలో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ లో చేరారు. ఈ పరిణామం అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బఅనే చెప్పాలి. కోనేరు కోనప్పతో పాటు ఆయన సోదరుడు కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.