English | Telugu

క్విడ్ ప్రోకో నిజమే.. అడ్జుకేటింగ్ అథారిటీ

వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియా సంస్థ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడాన్ని అడ్జుకేటింగ్ అథారిటీ సమర్థించింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ కు కడప జిల్లాలో 407 హెక్టార్ల భూమిని అప్పటి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీనిపై దర్యాప్తు చేసిన ఈడీ.. దాల్మియా సిమెంట్స్ కు సున్నపురాయి గనుల కోసం కడప జిల్లాలో భూముల కేటాయింపునకు ప్రతిగా దాల్మియా సంస్థ జగన్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టిందని నిర్ధారణకు వచ్చిన ఈడీ ఇది క్విడ్ ప్రో కో కిందకు వస్తుందని, ఈ లావాదేవీల ద్వారా మనీలాండరింగ్ జరిగింటూ కేసు నమోదు చేసింది. కాగా ఈడీ ఆస్తుల జప్తును సవాల్ చేస్తూ దాల్మియా సంస్థ అడ్జుకేటింగ్ అథారిటీని ఆశ్రయించింది. ఎడ్జుకేటింగ్ అథారిటీ ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జప్తును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.