English | Telugu
ఐదుగురు జడ్జిలదీ ఒకే మాట... ఏకాభిప్రాయంతో అయోధ్య తీర్పు...
Updated : Nov 9, 2019
దశాబ్దాలుగా నలుగుతోన్న అయోధ్య వివాదానికి ముగింపు పలుకుతూ... సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో జడ్జిల మధ్య బేధాభిప్రాయాలు రావడం సహజం. కానీ, అయోధ్య కేసులో మాత్రం సీజేఐ రంజన్ గొగోయ్ తోపాటు మిగతా సభ్యులైన జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్... మొత్తం ఐదుగురూ... ఎలాంటి భిన్నాభిప్రాయాలను తావు లేకుండా... ఒకే మాటపై తీర్పు ఇచ్చారు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్ కు అప్పగించాలని, అప్పటివరకు అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఏకాభిప్రాయంతో చెప్పారు.
అలాగే, అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని సూచించింది. అయితే, ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరు ముస్లిం ఉన్నప్పటికీ... మొత్తం అందరూ ఏకాభిప్రాయంతో జడ్జిమెంట్ ఇవ్వడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.