English | Telugu
లాక్డౌన్ సమయంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ!
Updated : Apr 7, 2020
సీఆర్డీఏ అధికారులకు మైండ్ దొబ్బినట్లుంది. అసలు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారో కనీస సృహ లేకుండా వ్యవహరిస్తున్నారని రైతులు ఛీ కొట్టారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో R5 జోన్ పై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన సీఆర్డీఏ అధికారులకు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. అధికారులను రైతులు, జేఏసీ నేతలు అడ్డుకున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజాభిప్రాయం ఎలా చేపడతారని రైతులు నిలదీశారు.
నిజంగా డ్యూటీలో భాగంగా వస్తే లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో తోక ముడిచిన సీఆర్డీఏ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.