English | Telugu
మందు షాపులు ఓపెన్ అంటూ నకిలీ జీవో...
Updated : Apr 4, 2020
మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నట్లు ఎక్సైజ్ అధికారుల పేరిట విడుదలైన జీవో అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్సైజ్ డీఎస్పీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జీవో కాపీని పోలిన నకిలీ కాపీని తయారు చేసి వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ ప్రకటించడంతో వైన్‌షాపులు, కల్లు దుకాణాలను మూసివేశారు.