తెలంగాణ మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే మరిచిపోయే అలవాటు ఉందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరాలని ఉందని వ్యాఖ్యానించారు. జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 24 గంటల కరెంట్ కాకుండా.. కేవలం 3 లేదా 4 గంటల కరెంటు మాత్రమే ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతానని లక్ష్మారెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రస్తుతం నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న మేలు సామాన్య ప్రజలకు అర్థం కావడంలేదు. జనాన్ని మంచివారు అనాలో, అమాయకులు అనాలో తెలియడం లేదన్నారు. సంక్షేమ పథకాలను ఇప్పుడు నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.