English | Telugu

దూరదర్శన్ లో మ‌ళ్లీ రామాయణం!

శ‌నివారం నుంచి దూరదర్శన్ లో రామాయణం పునః ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. వరుస ప్రకటనలతో బోర్ కొట్టించకుండా సీరియల్ ప్రసారం చేయనున్నారు. అప్పట్లో రామాయణం సీరియల్ కు విశేష ఆదరణ లభించింది. ఇప్పటికీ ఆ సీరియల్ పట్ల ప్రజల్లో ఆదరణ వుంది. జనం పౌరాణిక సీరియల్ ను మరింతగా ఆదరిస్తారని దూరదర్శన్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్ర‌స్తుతం కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో సీరియ‌ల్‌ను శ‌నివారం నుంచి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు జ‌వ‌దేక‌ర్ తెలిపారు. ఈ సీరియ‌ల్ ప్ర‌తి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుంచి 10 వ‌ర‌కు ఒక ఎపిసోడ్‌, ఆ త‌ర్వాత రాత్రి 9 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేస్తారు. తొలిసారి రామ‌య‌ణం సీరియ‌స్ 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం అయ్యింది. ఈ సీరియ‌ల్ ఇండియ‌న్ టెలివిజ‌న్ రేటింగ్స్‌ను మార్చేసింది.