English | Telugu

బిగ్ రిలీఫ్.. మూడు నెలలు ఈఎమ్ఐల టెన్షన్ లేదు

కరోనా కల్లోలం నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) బిగ్ రిలీఫ్ ప్రకటించింది. ఈఎంఐ చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల రుణాలు, ఈఎంఐలపై మూడు నెలల పాటు మారటోరియం విధిస్తున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. హోమ్ లోన్, కార్ లోన్లు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారందరూ మూడు నెలల పాటు ఈఎమ్ఐల టెన్షన్ తప్పించుకోవచ్చు. కమర్షియల్ బ్యాంకులే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు కూడా ఈ ఈఎమ్‌ఐ మారటోరియాన్ని అమలు చేయనున్నాయి.