English | Telugu
బైడెన్ అవినీతిని దాస్తున్నారు.. మీడియాపై ట్రంప్ ఫైర్
Updated : Oct 29, 2020
అమెరికాలో ఇటువంటి పక్షపాత వైఖరి ఇంతకుముందు ఎప్పుడూ లేదని, ఇప్పుడే మొదటి సారి చూస్తున్నామని అయన అన్నారు. అయితే చివరికి ఇది ఆ సంస్థలకే నష్టం చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఎన్నికలను ప్రస్తుత ప్రభుత్వ సూపర్ ఎకనమిక్ రికవరీకి, బైడెన్ డిప్రెషన్‌కు మధ్య జరుగుతున్న పోటీగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు ఈ రెండింటిలో ఏది కావాలో నిర్ణయించుకోవాలని కోరారు. ఇది ఇలా ఉండగా, మాస్కో మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌కు రష్యా నుంచి 3.5 మిలియన్ డాలర్లు అందినట్టు ట్రంప్ కొద్దికాలం క్రితం ఆరోపించారు.