English | Telugu
రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Updated : Oct 29, 2020
సిద్ధిపేటలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపైనా స్పందించారు కేటీఆర్. సిద్ధిపేటలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని... లేనిది ఉన్నట్టు చెప్పడం బీజేపీ నేతల అలవాటని కేటీఆర్ విమర్శించారు. తాము ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నామని... తమ ఓపిక నశిస్తే ప్రధాని మోడీని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మాట్లాడటం తమకు కూడా వచ్చని అన్నారు. బీజేపీ నేతలను అదుపులో పెట్టుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి సూచించారు కేటీఆర్.
మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్ కు ఇంత వరకు బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పటి వరకు 27 వేల కోట్ల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. బీజేపీ నేతలు అసత్యాలు చెప్పడం మానుకంటే వారికే మంచిదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికపై ఇంతవరకు మాట్లాడని కేటీఆర్.. పోలింగ్ కు ఐదు రోజుల ముందు హాట్ కాెమెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో పోటీ తీవ్రంగా ఉండటం వల్లే కేటీఆర్ స్పందించారనే ప్రచారం జరుగుతోంది.