English | Telugu
మేడ్చెల్ లో డాక్టర్ అనుమానాస్పద మృతి
Updated : Mar 9, 2020
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాకేత్ మిథులలో దారుణం చోటుచేసుకుంది. ప్లాట్ నంబర్57 లో దమ్మాయి గూడ శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఎం డి డాక్టర్ రవీంద్ర కుమార్.. తన లైసెన్సు రివాల్వర్తో పాయింట్ బ్లాక్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి తన భార్య తో రవీంద ఘర్షణ పడినట్లు సమాచారం. బంధువుల గృహ ప్రవేశానికి భార్య రాకపోవడంతో మనస్తాపం కు గురైనట్లు తెలుస్తోంది. అ
ర్ధరాత్రి తర్వాత రవీందర్ భార్య తన తల్లిగారి ఇంటికి వెళ్లగా.. రాత్రి 2 గంటల ప్రాంతంలో భార్య కు ఫోన్ చేసి తన కుమారుడి తో రవీందర్ మాట్లాడారు. కుమారుని క్షమించమని ఫోన్ లో చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసారు. ఆయన ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. ఆయన బంధువులు వెళ్లి చూడగా.. ఇంట్లో తన బెడ్ పై గన్ తో రక్తం మడుగులో రవీందర్ పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్ ఆధారాలు సేకరించాయి.