English | Telugu
ఢిల్లీ కాలుష్యం కంటే బాంబులు పెట్టి అందరిని చంపేయండి
Updated : Nov 26, 2019
ఢిల్లీలో పొల్యూషన్ పై సుప్రీం కోర్టు మండిపడింది. ఇలా కాలుష్యంతో నరకంలో బతకడం కంటే బాంబులు పెట్టి ఢిల్లీ ప్రజలందరిని ఒకేసారి చంపెయ్యాలని ఆక్రోశం వ్యక్తం చేసిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై జడ్జీలు మండిపడ్డారు. తప్పును ఒకరి పై ఒకరు నెట్టేసుకోవడం బ్లేమ్ గేమ్ ఆపాలని సూచించారు. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల బెంచ్ పొల్యూషన్ కేసును విచారించింది. పంటల వ్యర్ధాలు తగలబెట్టడం ఆపలేని మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాల ప్రజలు నవ్వుకుంటున్నారని జడ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు కాలుష్యాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదని ఆక్షేపించారు.
హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నాయని ఢిల్లీ ప్రజల్నీ క్యాన్సర్ బాధితులుగా మిగిలి పొమ్మంటారా అని ప్రశ్నించారు. ఢిల్లీ నరకం కంటే దారుణంగా తయారైందన్నారు జస్టిస్ అరుణ్ మిశ్రా. దేశంలో జీవితం చీపుగా ఏమీ లేదని ప్రాణానికి ఎలా ఖరీదు కడతారని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ఒక్కో వ్యక్తి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో చెప్పాలన్నారు. సుప్రీంకు సమాధానమిచ్చిన ఢిల్లీ చీఫ్ సెక్రటరీ రెండు అధికార కేంద్రాలతో పాలనా పరమైన సమస్యలని వస్తున్నాయన్నారు. దీంతో విభేదాలు పక్కన పెట్టి కలిసి పని చేయాలని ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వాలకు సూచించారు జస్టిస్ అరుణ్ మిశ్రా. సిటీలోని వేర్వేరు చోట్ల ఎయిర్ ప్యూరిఫయింగ్ టవర్స్ ను ఏర్పాటు చేసే అంశంలో పది రోజు ల్లోగా ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఉత్తర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పైనా సిరీస్ ఇయ్యరు జస్టిస్ అరుణ్ మిశ్రా. మీపై మీ అధికార యంత్రాంగంపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ప్రశ్నించారు.
ఎవరినీ ఉపేక్షించేది లేదనే విషయం తెలుసుకోవాలని సీఎస్ కు సూచించారు. ఖచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే పంటల వ్యర్థాలు తగలబెడుతున్న వారిపై వెయ్యికి పైగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసామని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు యుపిసిఎస్. అలాగే ఒక కోటి రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్లు చెప్పారు. అయితే ఇలాంటి తాత్కాలిక చర్యల కంటే పాజిటివ్ యాక్షన్ మొదలుపెట్టాలనీ సీఎస్ కు సూచించారు జడ్జీలు. ఢిల్లీ లిమిట్స్ లో నడుస్తున్న ఫ్యాక్టరీలు పర్యావరణంపై వాటి ప్రభావం ఎలా ఉందో సమగ్ర నివేదిక సమర్పించాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది సుప్రీంకోర్టు.