English | Telugu
నిజంగానే ఆడవారికి మంచి రోజులు రాబోతున్నాయా?
Updated : Oct 9, 2019
హైదరాబాద్ కు ఐటీ కంపెనీల అభివృద్ధి వేగవంతమవుతోంది. పరుషులకు ధీటుగా మహిళలు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల అంటేనే ఇరవై నాలుగు గంటల డ్యూటీ. మహిళలకూ మినహాయింపు ఉండదు. దీంతో నైట్ షిప్టు డ్యూటీ లు చేసే మహిళల సంఖ్య పెరిగింది. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు అయింది. దీంతో పరిస్థితు లు పూర్తి గా మారిపోయాయి. సైబరాబాద్ పోలీసులు చేపట్టిన భద్రత చర్యల తో ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ఎప్పుడైనా ఉద్యోగాని కి వెళ్లి రాగలుగుతున్నారు మహిళా ఉద్యోగులు. సైబరాబాద్ తొలినాళ్ల లో మహిళల భద్రతకు సవాల్ గా ఉండేది. ఐటీ కారిడార్ లో వందల సంఖ్య లో ఐటీ కంపెనీలు రావడం లక్షలాది మంది మహిళలు ఉద్యోగాల్లో చేరడం అందుకు కారణం.రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న దాడులు లైంగిక వేధింపులతో పోలీసు లు అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈవ్ టీజింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు భరోసా కేంద్రాల షీటీమ్స్ బృందాలను రంగంలోకి దింపారు.ఫలితంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ లో క్రమం గా మహిళల కు భద్రత పెరిగింది. షీటీమ్స్ బృందాలు క్షేత్ర స్థాయిలో నిరంతరం పనిచేయటంతో పాటు వాట్సప్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపడుతున్నారు. ఐటీ కారిడార్ లో ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. భరోసా సెంటర్ లను ఏర్పాటు చేశారు. మహిళలకు భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు డాక్యుమెంట్ లతో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగినీలు ప్రయాణించి ఆటో క్యాబ్ లకు సంబంధించి పూర్తి స్థాయి నిఘా ఉండేలా క్యూ ఆర్ కోడ్ ను రూపొందించారు.సైబరాబాద్ పోలీసులు చేపట్టిన చర్యల తో మహిళలపై నమోదయ్యే కేసు లు పూర్తిగా తగ్గు ముఖం పట్టాయని సైబరాబాద్ షీటీమ్స్ డీసీపీ అనసూయ తెలిపారు.
మహిళలకు సంబంధించిన నష్టాలు ఏమున్నాయి వాళ్ల కి సపోర్ట్ సిస్టమ్స్ ఏమున్నాయి ఎన్జీవోస్ ఎవరున్నారు మరియు ఎవరైనా మహిళ బాధతో వస్తే ఆమెకు ఏ రకంగా చేయూత నివ్వాలి ఏ రకంగా సానుభూతి చూపించాలి అన్న అంశాల మీద కూడా వాళ్లక ట్రైనింగ్ ఇచ్చి, వాళ్లు అక్కడ ఐటి ఇండస్ట్రీలో ఎవరైనా మహిళ ఏదైనా బాధతో వాళ్ల దగ్గర వస్తే వాళ్లకు ఎటువంటి సహాయం ఇవ్వాలి షీటీమ్స్ కావాలంటే షీటీమ్స్ నంబర్స్ అట్లాగే భరోసా సెంటర్ నంబర్స్ ఇచ్చి ఎన్ని రకాలు గా ఆమెకే సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి అన్నదాని మీద వాళ్ల ని ట్రెయిన్ చేసి వాళ్లకే చేయూత కోసం వాళ్ళకు భరోసాను ఇవ్వడంను ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనసూయ తెలియజేశారు.అసలు మహిళలను తప్పుడు ఆలోచనతో చూడాలనే ఆలోచన కూడా రాకుండా చేస్తున్నారని మహిళా ఉద్యోగులకు రవాణా సౌకర్యం కల్పించడంపై సైబరాబాద్ పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించారు. ఐటీ కారిడార్ లో ఉచితంగా షీ షటిల్స్ మినీ బస్సులను మహిళల కోసం ఏర్పాటు చేశారు. యువతులపై జరుగుతున్న సంఘటనల నేపథ్యం లో వారికి మెరుగైన భద్రత సౌలభ్యమైన ప్రయాణం అందించాలని సైబరాబాద్ పోలీసు లు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు తమ తమ మహిళా ఉద్యోగు లకు రవాణా సౌకర్యా లు కల్పించాలని జీవో నెంబర్ యాభై ఒకటి ను తీసుకొచ్చారు.
దీంతో సైబరాబాద్ పరిధి లోని అన్ని కంపెనీలూ మాల్స్, మల్టీప్లెక్స్ లు, మహిళా ఉద్యోగు లకు వారి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ట్రాన్స్ పోర్టేషన్ ఫెసిలిటీస్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ గురించి షీ షటిల్ బస్ సర్వీస్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు నాలుగు బస్సు లు ఐటి కారిడార్ ఏరియా లో తిరుగుతున్నాయి అందులో ఏ మహిళా ఉద్యోగి అయినాగానీ ఐటీఐ కాకపోవచ్చు అక్కడ ఇతర రంగాల్లో పని చేస్తున్న మహిళలు ఎవరైనా గాని ఏ మహిళైనా గానే హాప్ ఆన్ హాప్ ఆఫ్ అన్నమాట ఎక్కడైనా ఎక్కొచ్చు ఎక్కడైనా దిగొచ్చు ఆ రకంగా షీ షటిల్ బస్ నడుస్తున్నాయి.
ఒక ఐటీ కారిడార్ లోని కాదు సైబరాబాద్ పరిధిలోనూ పోకిరీలు, ఆకతాయిల ఆట కట్టించడంతో పాటు మోసగాళ్లు భార్యలను వేధిస్తున్న ప్రబుద్ధుల నయవంచన కు గురి చేస్తున్న కేటుగాళ్ల ను హెచ్చరిస్తూ బాధిత మహిళల కు రక్షణ కల్పిస్తున్నామని ప్రత్యేక భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మహిళల ను వేధిస్తున్న వారి ఆట కట్టించడం తో పాటు బాధిత మహిళల కు లైంగిక దాడుల కు గురైన చిన్నారులకు కుటుంబ సభ్యుల వేధింపులకు గురైన బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహించి మానసిక దృఢత్వాన్ని కల్పించి సమస్య లను ఎదుర్కొనే ధైర్యాన్ని అందించే విధంగా భరోసా కేంద్రాన్ని తీర్చిదిద్దామని అంటున్నారు. మహిళల రక్షణ కోసం సైబరాబాద్ పోలీసు లు తీసుకుంటున్న భద్రతా చర్యల తో నేరాల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని పదేపదే నేరాలు చేసే వారి డేటాను తీసుకొని వారి పై నిరంతరం నిఘా పెడుతున్నారు అధికారులు.నిజంగానే ఈ చర్యలన్ని సక్రమంగా జరుగుతుంటే ఆడవాళ్ళ విషయంలో వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండగలగటమే కాగా నేరాల సంఖ్య కూడా చాలా వరకు నియంత్రించడంలో ఎటువంటి సందేహంలేదు.