English | Telugu

కోడెల శివరాం స్టేట్మెంట్ కోసం గుంటూరుకి బంజారాహిల్స్ పోలీస్ బృందం!!

గత కొన్ని రోజుల కిత్రం టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు పై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి.ఆయన కుమారుడే కోడెలను హత్య చేశాడు అని వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని.. ఇలాంటి ఆరోపణలు కూడా ఎదురైయ్యాయి. దీని విచారణనిమిత్తం బంజారా హిల్స్ పోలీసులు వారి కుటుంబ సభ్యులను కూడా విచారణ చేపట్టారు. ఆయన ఫోన్ మిస్సింగ్ పట్ల కూడా చాలా అనుమానాలు వెలిగులోకి వచ్చాయి. కోడేలను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది ఆ ఫర్నీచర్ కేసు.ఇందులో తన కొడుకు,కూతురకు కూడా భాగం ఉందని కేసులు ఆరోపించారు.ఇందు భాగంగా ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్ మిస్సింగ్ కేసులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ కృష్ణ మంగళగిరి కోర్టు కు హాజరయ్యారు. అయితే ఇదే సమయంలో కోడెల ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు లు విచారించారు. ఈ విచారణ కు కుమారుడు శివరామ్ హాజరుకాలేకపోయారు. మంగళగిరి కోర్టు కు హాజరు కావాల్సి ఉండడం తో ఆయన తన తండ్రి ఆత్మహత్య కేసు విచారణ కు రాలేకపోయారు. ఇపుడు ఆయన స్టేట్ మెంట్ రికార్డు చెయ్యటానికి బంజారాహిల్స్ పోలీసులు గుంటూరు వెళ్లడానికి సిద్ధమయ్యారు.ఒక పక్క మంగళ గిరి కోర్ట్ కేసులో హాజరు అయ్యి బెయిల్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మరో పక్క తండ్రి ఆత్మహత్య కేసు లో విచారణకు హాజరు కావడం వీలు కాకపోవడంతో ఆఖరికి పోలీసులే తనున్న గ్రామానికి వెళ్లాలని నిర్ణయించారు. దీని బట్టి బంజారహిల్స్ పోలీసులు ఈ కేసును వీలైనంత త్వరగా ముగిస్తారని అంతేకాక ఈ కోడెల కేసు పై వారు చాలా నిఖచ్చిగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది.ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతోందో వేచి చూడాలి.