English | Telugu

కరోనా తో ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ కన్నుమూత

ఫ్లాయిడ్ కార్డోజ్, చిరునామా అక్కర్లేని పేరున్న చెఫ్ ఈ రోజు న్యూ యార్క్ లో మరణించారు. ముంబై లో జన్మించిన ఈ 59 ఏళ్ల చెఫ్ కరోనా వైరస్ బారిన పడి న్యూ యార్క్ లోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో కన్ను మూశారు. మార్చ్ 8 నుంచి తిరిగి వచ్చిన తర్వాత, జ్వరం బారిన పడిన ఫ్లాయిడ్ కార్డోజ్, తనకు తానుగా ఆస్పత్రిలో ఎడ్మిట్ అయినట్టు తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడించారు. ఆయన స్థాపించిన ది హంగర్ ఇన్ కార్పొరేషన్ కంపెనీ, ఆయన ఆస్పత్రిలో ఎడ్మిట్ అయినా విషయాన్న ధృవీకరించింది కూడా. ఆయన 1998 లో యు ఎస్ ఏ లో ఏర్పాటు చేసిన తబలా రెస్టారెంట్ , అది కూడా డ్యానీ మేయర్, యూనియన్ స్క్వేర్ హాస్పిటాలిటీ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయటం -ఒక చరిత్ర గా నిలిచిపోయింది. 2010 లో ఆ రెస్టారెంట్ మూతబడినప్పటికీ, యు ఎస్ ఏ లోని ఇండియన్ రెస్టారెంట్లలో అత్యంత ప్రతిష్టాత్మక రెస్టారంట్ గా పేరు పొందింది. ఆ తర్వాత ఆయన అటు యు ఎస్ ఏ లోనూ, ఇటు భారత్ లోనూ పలు రెస్టారెంట్స్ ప్రారంభించారు.
ఫ్లాయిడ్ కార్డోజ్ - ముంబై లో బాంబే క్యాంటీన్, ఓ ' పెడ్రో అనే ఒక గోవన్ రెస్టారెంట్ ల నిర్వహణే కాకుండా, న్యూ యార్క్ లోని పావు వల్లా ని బాంబే బ్రెడ్ బార్ గా కళాత్మకం గా మలచటం ద్వారా తన దైన ముద్ర వేసుకున్నారు.