English | Telugu
కరోనా వ్యాక్సిన్ తయారైందా?
Updated : Mar 3, 2020
కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అంటున్నారు.
కరోనా తొలి వ్యాక్సిన్‌ను రూపొందించామని అమెరికాకు చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా కూడా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగాలకు సిద్ధం చేశామని తెలిపింది. ఈ ట్రయల్స్ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. తొలి దశ ప్రయోగం విజయవంతమైతే.. అది అందుబాటులోకి రావడానికి ఏడాది సమయం పడుతుంది.
2002లో సార్స్ విజృంభించినప్పుడు దాని వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యే సరికి 20 నెలలు పట్టగా తాజాగా కరోనా వైరస్ జన్యు సమాచారం తెలుసుకున్న ఆరు వారాల్లోనే వ్యాక్సిన్‌ను రూపొందించి, మనషులపై ప్రయోగాలకు రెడీ చేయడం విశేషం.
మందు కనిపెట్టినా, దాన్ని పంపిణీ చెయ్యడానికి కనీసం 3 నెలలు పడుతుంది. ఆ మందు కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.