English | Telugu

ఆదివారంనాడు 65వేలకుపైగా పాజిటివ్  కేసులు!

ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. ఆదివారంనాడు ఒక్కరోజే కొత్తగా 65వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 69వేల మందికిపైగా బలైపోయారు. నిన్న ఒక్కరోజే 4వేల మందికిపైగా చ‌నిపోయారు.
ఇప్ప‌ట్టి వ‌ర‌కు అమెరికాలో 3 లక్షల 34వేలకుపైగా కేసులు న‌మోదైయ్యాయి. మృతుల సంఖ్య పదివేలకు చేరువలో ఉంది.

ఇటలీలో 15వేల 887 మంది చ‌నిపోయారు. స్పెయిన్‌లో 12వేల 518మంది పౌరులు కరోనాతో చనిపోయారు. బ్రిటన్‌లో కరోనా మరణాలు 5వేలకు చేరువలో ఉన్నాయి. ఫ్రాన్స్ లో 8వేలకు పైగా పౌరులు మృతి చెందారు. జర్మనీలో కరోనాతో 1576మంది చనిపోయారు.