English | Telugu

భ్రష్టు పట్టిన వ్యవస్థలో కరోనా మార్పు తెస్తుందా?

కరోనా! నో షేక్ హాండ్! సంస్కారంతో కూడిన నమస్కారం నేర్పింది! కరోనా సంగతి తెలీదు గానీ చేతులు శుభ్రంగా కడుక్కోండ్రా అంటే యూనిసెఫ్ చెప్పినా నవ్వి తీసి పారేసాం! ఇపుడు చేతులు సబ్బులరిగేలా సానిటైజర్లు ఐపోయేలా కడగడంతో మిగిలిన రోగాలు ఆమడ దూరానికి వెళ్లి పోయాయి!

అల్లం వెల్లుల్లి శొంఠి మిరియాల గొప్పతనం తెలిసొచ్చింది! మన చారు చైనా వాళ్లు తాగుతున్నారు! పురుగుల మందు లాంటి కూల్ డ్రింకుల జోరు తగ్గింది!

AC లు మానేయడంతో కరెంటు బిల్లు జేబుకు చిల్లు పడ్డం లేదు! రైళ్లలో బస్సుల్లో అనవసర ప్రయాణాలు తగ్గి పోవడంతో అవసరమైన వాల్లకి సీట్లు దొరుకుతున్నాయి! ఇంటి పట్టునే ఉండండం తో ఇంట్లో వాళ్లతో మాట్లాడ్డం పెరిగింది బంధాలు బల పడుతున్నాయి!

తాగే నీళ్ల నుండి వేసుకునే జోళ్ల వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం! ఏమౌతుందిలే అన్న తెంపరితనం కనుమరుగైంది! అనవసర తిరుగుళ్లు లేవ్! దుబారా ఖర్చుల్లేవ్! హోళీ రోజు పసుపూ కుంకుమతో సున్నితంగా కానిచ్చారు! హమ్మో లేదంటే గ్రీజు ఆయిలూ కోడిగుడ్లూ నానా ఛండాల మయ్యేది! మ‌న‌మే కాదు ప్ర‌పంచం మొత్తంలో మార్పు క‌నిపిస్తోంది. రోమ్ లో చర్చిలు మూసేసారు, ఇరాన్ మసీదుల్లో సామూహిక ప్రార్థనలు లేవు, ఆంక్షలు, ఇండియాలో దేవాలయాల్లోకి 28రోజుల నిబంధన కొందరికి పెట్టారు. దేవుని ప్రార్థనలకు కూడా అందరినీ ఒకచోట గుమికూడవద్దు అంటున్నారు.

కరోనా తరువాత... ముందు ప్రతీరోజు కుల, రాజకీయ, మత ద్వేషప్రచారం, తద్వారా వచ్చే ఆందోళననుంచి, గాభరానుంచి మీ మనసుకి ప్రశాంతత, ఆరోగ్యానికి స్వస్థత చేకూరుతుంది.

ప్రార్ధనలతో అన్ని రోగాలు పోతాయనేవారు వూహన్ ఎందుకువెళ్లి ప్రజలను ఎందుకు కాపాడటంలేదు? అందరూ ఏకమై ముందు పర్యావరణాన్ని కాపాడండి. పర్యావరణ రక్షణ చేస్తే, కరోనా కన్నా భయంకరమైనవి మున్ముందు రాకుండా పర్యావరణము మిమ్మల్ని కాపాడుతుంది.